కృష్ణకు దాదా సాహెబ్… అల్లు అరవింద్ కు పద్మశ్రీ…

సూపర్ స్టార్ కృష్ణ దాదాపుగా 500 వరకు సినిమాలు చేశారు. ఎన్నో గొప్ప గొప్ప టెక్నాలజీని ఇండస్ట్రీకి అందించారు. సినిమా స్కోప్, కలర్, ఇలా ఎన్నో రకాల ఆవిష్కరణ తీసుకొచ్చారు. కానీ ఆయనకు అందాల్సిన గౌరవం ఇప్పటి వరకు అందలేదు. సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తూ ఉంటుంది. ఈ ఏడాది అమితాబ్ కు దాదాసాహెబ్ అవార్డు అందించారు.

కాగా, కృష్ణకు కూడా ఈ అవార్డు ఇచ్చేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సిఫారసు చేయాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఇక ఇదిలా ఉంటె, అల వైకుంఠపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చేలా తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని యూనిట్ కోరింది. మెగాస్టార్, అల వైకుంఠపురంలో యూనిట్ కోరిన కోరికలను ప్రభుత్వాలు అంగీకరిస్తాయా.. చూద్దాం.

Related posts

Leave a Comment