నూతన సంవత్సర వేడుకలకు టీడీపీ దూరం

Chandrababu-Naidu-

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. పార్టీ నేతలు, సానుభూతిపరులు దీనిని పాటించి ఆ ఖర్చులు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీలకు విరాళంగా ఇవ్వాలని ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. ‘నా వద్దకు ఎవరూ బొకేలు, కేకులు తీసుకురావద్దని విజ్ఞప్తి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు, పనులు కోల్పోయిన కూలీలకు ఆ రోజున అందరూ సంఘీభావంగా నిలబడాలి’ అని ఆయన కోరారు. ఇది వేడుకలు చేసుకొనే సమయం కాదని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment