తాగండి.. తూలండి.. ఇంటి దగ్గర దింపుతాం!

మరో 36 గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి అప్పుడే ప్రపంచవ్యాప్తంగా నగరాలు ముస్తాబవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు.. పసందైన ఆఫర్లతో యువతను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. మందుప్రియుల కోసం రకరకాల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఇక అటు సీనియర్లు అయితే కొత్త సంవత్సరాన్ని వెల్‌కమ్ చేయడం కోసం ఇప్పటికే పెద్ద పెద్ద కేకులు ఆర్డర్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే మందుబాబులకు పబ్ నిర్వాహకులు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బంది లేకుండా తాగి ఇంటికి వెళ్లలేని మందుబాబులను.. క్షేమంగా వారి ఇంటి దగ్గర దిగబెడతామని ప్రకటిస్తున్నారు. అయితే ఇందుకోసం ఎక్స్‌ట్రా ఛార్జీ ,ముందుగానే చెల్లించాలని కండీషన్ పెడుతున్నారు. కాగా, న్యూ ఇయర్ రోజు తాగి రోడ్డు మీద హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక జారీ చేసిన విషయం విదితమే.

Related posts

Leave a Comment