యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత: ఎంపీ గల్లా జయదేవ్

సనాతన ధర్మానికి నెలవు అయిన భారతదేశంలో మహిళలు, ఆడపిల్లలపై వేధింపులు, అత్యాచారాలు, దాడుల కేసుల సంఖ్య పెరగడం విచారకరమని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇది ఎందుకు జరుగుతుందో సమాజంగా మనం అర్థం చేసుకోవాలని ట్వీట్లు చేశారు.

నేరస్థులను శిక్షించడానికి ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చి అమలు చేస్తున్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని గల్లా జయదేవ్ సూచించారు. తమను తాము ఎలా రక్షించుకోవాలో అమ్మాయిలకు నేర్పినప్పుడు, చిన్న వయస్సు నుండే మహిళలను గౌరవించాలని అబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

స్త్రీ పురుష సమానతలు, ఒకరు లేకుండా మరొకరు లేరన్న విషయం తెలియజేయాలని గల్లా జయదేవ్ అన్నారు .అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు. యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment