జగన్‌ ఆర్నెల్ల పాలన బాగుంది!

‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ఆర్నెల్ల పాలన బాగుంది. మంచి ప్రారంభం’ అని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏపీకి మూడు రాజధానులు మంచిదో.. కాదో.. ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని తెలిపారు. ట్విటర్‌లో ‘ఆస్క్‌ కేటీఆర్‌’లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి? రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటే? అని ఓ నెటిజన్‌ కేటీఆర్‌ను ప్రశ్నించాడు. దానికి తెలివిగా సమాధానం చెప్పిన కేటీఆర్‌.. అది నిర్ణయించేది తాను కాదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలని బదులిచ్చారు.

Related posts

Leave a Comment