తెలంగాణ యువత కేటీఆర్‌ వైపు చూస్తోంది- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ప్రపంచం తెలంగాణ అంతా తెలంగాణ సమాజం వైపు చూస్తుంటే, తెలంగాణ సమాజం మాత్రం కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ వైపు చూస్తోందని టూరిజంశాఖ మంత్రి కె. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధిని మెచ్చుకుంటుంటే రాష్ట్రంలో బీజేపీ నాయకులకు మాత్రం ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల పై తీవ్రంగా స్పందించారు. ఇంటి సభ్యులను గెలిపించుకోలేని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని విమర్శిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా సఖ్యతలేదని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ బిల్లు తర్వాత దేశంలోని పలు రాష్ర్టాల్లో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. కానీ తెలంగాణ మాత్రం ప్రశాంతంగా ఉందని అన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఇక తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవాలన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కుల మతాలను రెచ్చగొట్టడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని విమర్శించారు.

Related posts

Leave a Comment