రెండో అత్యుత్తమ నగరం కరీంనగర్‌!

హైదరాబాద్‌ తర్వాత రెండో అత్యుత్తమ నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని ఐటీ టవర్‌ నిర్మాణానికి రూ.38 కోట్లు మంజూరుచేశారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. కరీంనగర్‌ ఐటీ టవర్‌లో కంపెనీల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కార్యాలయంలో ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రెండేండ్లలోనే అత్యాధునిక వసతులతో కరీంనగర్‌కే మణిమకుటంగా ఐటీ టవర్‌ను నిర్మించామని చెప్పారు. ఈ నెల 30న మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా టవర్‌ ప్రారంభానికి చర్యలు తీసుకున్నామని, కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా దానిని వాయిదా వేస్తున్నామని తెలిపారు.

Related posts

Leave a Comment