మాట మార్చి, మడమ తిప్పి జగన్ గారు అమరావతిని ముంచేశారు: లోకేశ్

lokesh

‘భారీ వరదకి కూడా అమరావతి మునగలేదు. జగన్ గారి దొంగ దెబ్బకి అమరావతి మునిగిపోయింది’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. నిండు సభలో గతంలో అమరావతికి జై కొట్టారని. కనీసం 30 వేల ఎకరాలు ఉంటే కానీ రాజధాని అభివృద్ధి సాధ్యం కాదని అన్నారని లోకేశ్ అన్నారు.

రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టారని, అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని నమ్మబలికారని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక మాటమార్చి, మడమ తిప్పి జగన్ గారు అమరావతిని ముంచేశారని విమర్శించారు.

Related posts

Leave a Comment