కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన జగన్

కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇప్పటికే ఈ ప్లాంటు కోసం 3,200 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 2 టీఎంసీల నీటిని కూడా కేటాయించింది. ఐరన్ ఓర్ కోసం ఎన్ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Related posts

Leave a Comment