26న సూర్యగ్రహణం.. బెజవాడ దుర్గగుడి మూసివేత

కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 26న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. వచ్చే గురువారం బహుళ అమావాస్య ఉదయం 8.11 నుంచి 11.20 గంటల వరకు గ్రహణ మోక్షకాలం ఉంటుందని దుర్గగుడి వైదిక కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రహణం వీడిన తర్వాత సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టు పేర్కొంది. కాగా, భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు నిలిపివేసిన అన్ని ఆర్జిత సేవలను 27వ తేదీ నుంచి పునరుద్ధరిస్తామని తెలియజేసింది.

Related posts

Leave a Comment