కేసీఆర్‌.. ముదిరాజ్‌ల తల్లిపాలు తాగి పెరిగాడు

‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముదిరాజ్‌ల తల్లిపాలు తాగి పెరిగాడు. కేసీఆర్‌ మాతృమూర్తికి 12 మంది సంతానం కావడంతో.. పాలు సరిపడా లేని సమయంలో.. పొరుగున ఎంతో ఆప్యాయంగా ఉండే ముదిరాజు తల్లి పాలు ఆయన తాగారు. ఇదీ ముదిరాజ్‌ కులస్థులకు.. సీఎం కేసీఆర్‌కు మధ్య ఉన్న అనుబంధం. ఆ ప్రేమతోనే ఆయన మన కులస్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరి క్రాస్‌ రోడ్డులోని ఓ మామిడితోటలో ఆదివారం జరిగిన ముదిరాజ్‌ల వన సమారాధనలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముదిరాజ్‌ల సాధక బాధకాలు తెలుసు కనకనే వారి ఆర్థికాభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల అన్నారు.

Related posts

Leave a Comment