అన్ని ధరలు పై పైకే…ఇదేనేమో కేసీఆర్ బంగారు తెలంగాణ: విజయశాంతి ఎద్దేవా

కేసీఆర్ ప్రభుత్వంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. ‘అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ టీఆర్ఎస్ పభ్రుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అంటే ఇదేనేమో’ అని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపి టికెట్టు ధరలు పెంచారని, ఆ తర్వాత పాల ధరను పెంచారని, తాజాగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.

ఓ వైపు దుబారా, మరోవైపు అప్పులతో చివరికి కేసీఆర్ దొరగారు ప్రభుత్వాన్ని నడపలేనని చేతులెత్తేసినా ఎత్తేయవచ్చునని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం దుబారా ఖర్చులను సామాన్యుడి నడ్డి విరిచి భర్తీ చేస్తున్నట్లుందని ధ్వజమెత్తారు. రేపు జనం రోడ్డు మీద నడిచినందుకు కూడా డబ్బులు వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

Related posts

Leave a Comment