హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు మంత్రులు మహమూద్‌అలీ, కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీహెచ్ మల్లారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
రాష్ట్రపతి కోవింద్ ఈ నెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బసచేయనున్నారు. 22న సాయంత్రం రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విందుకు గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. అదేరోజు తెలంగాణ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో సొసైటీ మొబైల్‌యాప్‌ను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 23న పుదుచ్చేరి, 25న కన్యాకుమారిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 27న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం నిర్వహించనున్నారు. ప్రభు త్వ ప్రతినిధులు, ప్రముఖులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి 28 ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

Related posts

Leave a Comment