వయసు ఎనిమిదేళ్లు… వార్షిక సంపాదన రూ.185 కోట్లు

పట్టుమని పదేళ్లులేవు. కానీ ఏటా కోట్లు కూడబెడుతున్నాడీ బుడతడు. అతని వార్షిక ఆదాయం చూసి ఫోర్బ్స మ్యాగజైన్ తన పత్రికలో చోటు కల్పించిందంటే ఇతని ప్రత్యేక అర్థం చేసుకోవచ్చు. టెక్సాస్ కు చెందిన ఎనిమిదేళ్ల కుర్రాడు తన కళ్లు చెదిరే ఆదాయంతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే…టెక్సాస్ కు చెందిన ర్యాన్ కాజీ వయసు ఎనిమిదేళ్లు. ఇతని మూడేళ్ల వయసులో అతని తల్లిదండ్రులు కాజీ పేరున ‘ర్యాన్ వరల్డ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు.

మొదట్లో ఈ చానల్ కు అంతగా ఆదరణ లేకపోయినా తదనంతర కాలంలో కాజీ పోస్టు చేసిన వీడియోల వల్ల పుంజుకుంది. తాజాగా ‘ర్యాన్ టోయ్స్ రివ్యూ’గా ఈ చానల్ పేరు మార్చారు. ఈ చానల్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బొమ్మలు, ఆటవస్తువుల గురించి ర్యాన్ ఆడుకుంటూ వివరిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నాడు.

30 కోట్ల మంది సబ్ స్క్రైబ్ చేశారంటే ఈ బుడతడి చానల్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ర్యాన్ కాజీ పోస్టు చేసిన కొన్ని వీడియోలను మూడున్నర కోట్ల మంది వీక్షిం చారంటే ఆదరణ అర్థమవుతుంది. అందుకే 2019 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని సంపాదన పరుల జాబితాలో ర్యాన్ కాజీ పేరు చేర్చింది.

Related posts

Leave a Comment