రాష్ర్టానికి ప్రత్యేక నిధులివ్వండి

కేంద్రప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించి రాష్ర్టాలకు తగిన ఆర్థిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. తెలంగాణ వంటి బలంగా ఎదుగుతున్న రాష్ర్టాలను ప్రోత్సహించి బలమైన రాష్ర్టాలు.. బలమైన దేశం అన్న సూత్రాన్ని పాటించాలని సూచించారు. నీతిఆయోగ్ సిఫారసులను అనుసరించి మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్‌చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రాబోయే 2020-21 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్‌చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కేంద్ర బడ్జెట్ ముందస్తు సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ర్టానికి రావాల్సిన అంశాలను ప్రస్తావిస్తూనే దేశ ఆర్థిక పురోగతికి, రాష్ర్టాల బలోపేతానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై నిర్దిష్ట సూచనలుచేశారు.

Related posts

Leave a Comment