జగన్ రాజధాని ప్రకటన.. రోడ్డుపై పురుగులమందు డబ్బాలతో రైతుల ధర్నా!

ఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటనతో.. అమరావతి రైతులు ఆందోళనతో రోడ్డెక్కారు. మందడంలో పురుగుమందుల డబ్బాలతో రోడ్డుపైనే బైఠాయించి.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నీ ఏర్పాటవుతున్న అమరావతి నుండి సెక్రటరీయేట్‌ను, హైకోర్టును తరలించడాన్ని తప్పుబట్టారు. అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పరిపాలన మొత్తాం అక్కడి నుంచే కొనసాగాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు కూడా అమరావతినే రాజధానిగా కావలంటూ ఆందోళన చేస్తున్నారు.

అమరావతిలో ఏపీ రాజధాని ఏర్పాటవుతుందని.. అందుకే తమ భూములన్నీ ఇచ్చామని, ఇప్పుడు రాజధానిని మూడు ప్రదేశాల్లో ఇవ్వడమేంటని వారు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. హైకోర్టు, సెక్రటరియేట్ తరలిపోతే ఇక్కడి రైతులు అన్యాయం అయిపోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. రైతులందరూ.. రోడ్డుపై బైఠాయించి పురుగుమందుల డబ్బాలతో సెక్రటరియేట్‌ని మోహరించారు. ఎన్నికల ముందు ఒక హామి ఇచ్చి.. ఇప్పుడొక హామీనా..? ఎన్నికలకు ముంద అమరావతినే ఏపీ రాజధాని అని చెప్పి.. ఇప్పుడు ఇలా ఎలా చేస్తారంటూ రైతులు సీఎం జగన్‌ని ప్రశ్నిస్తున్నారు.

Related posts

Leave a Comment