నరసరావుపేట వైసీపీ ఎంపీకి కీలక పదవి… ఆ కమిటీలో…

నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర స్థాయిలో కీలక పదవి దక్కింది. ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లకు సంబంధించిన కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలును కేంద్ర ప్రభుత్వం నియమించింది. విద్యా వ్యవస్థలో ఈ కమిటీ పాత్ర ఎంతో ప్రముఖమైంది.

ఐఐటీల అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది. వైసీపీ తరపున ఇప్పటికే పలువురు ఎంపీలకు వివిధ పార్లమెంట్ కమిటీల్లో చోటు దక్కగా… తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు ఐఐటీ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా అవకాశం వచ్చింది. ఏపీకి చెందిన టీడీపీ

ఎంపీలకు సైతం వివిధ కమిటీల్లో చోటు దక్కింది. విజయవాడ ఎంపీ కేశినేని నానికి పార్లమెంటరీ స్థాయి మెడికల్ కౌన్సిల్ కమిటీలో ఛాన్స్ ఇచ్చింది కేంద్రం.

Related posts

Leave a Comment