తిరుమలలో కొత్తరకం మోసం..

శ్రీవారి సిపారస్సులపై కేటాయించే దర్శనంలో కొత్త రకం మోసాన్ని జెఈవో కార్యాలయ సిబ్బంది గుర్తించింది. ఐఆర్‌ఎస్ అధికారిన౦టూ గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డి అనే వ్యక్తి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను జెఈవో కార్యాలయానికి పంపించాడు. ముంబాయిలో ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్‌నంటూ సిఫార్సు లేఖను పంపాడు. అయితే నకిలీ ఐఆర్‌ఎస్ అధికారిగా గుర్తించిన జెఈవో కార్యాలయ సిబ్బంది… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో రత్నారెడ్డి. శ్రీవారిని దర్శించుకున్నాడు. నఖిలీ అధికారి బాగోతం బయటపడడంతో ఉన్నతాధికారులు సిఫార్సు లేఖలు కూడా క్షుణ్ణంగా పరిశిలిస్తున్నారు.

Related posts

Leave a Comment