విక్టరీ వెంక‌టేష్‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

ఒకే చ‌ట్రంలో ఇరుక్కుపోకుండా కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌ని చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. సీరియ‌స్‌, యాక్ష‌న్, కామెడీ, రొమాన్స్ ఇలా ఏ పాత్ర‌ల‌నైన ప‌రకాయ ప్ర‌వేశం చేసి ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని అందిస్తారు వెంకీ. ఈ రోజు వెంక‌టేష్ 59వ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా అభిమానులు, సెల‌బ్రిటీలు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు.

రామానాయుడు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వెంక‌టేష్ అతి త‌క్కువ కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విక్టరీనే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఎక్కువ‌గా ఆక‌ర్షించాడు. క‌లిసుందాం రా, ప్రేమించుకుందాం రాం, నువ్వు నాకు న‌చ్చావ్‌, ప‌విత్ర బంధం, గ‌ణేష్‌, ల‌క్ష్మీ, తుల‌సి వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు వెంకీ

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్‌ని మ‌రోసారి తీసుకొచ్చి అద్భుత‌మైన హిట్స్ సాధిస్తున్నారు వెంక‌టేష్‌. తొలిసారి మహేష్‌ బాబుతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన వెంకీ తరువాత యంగ్‌ హీరో వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్‌ 2 సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. ఇక తాజాగా త‌న రియల్‌ లైఫ్‌ అల్లుడు నాగ చైతన్యతో కలిసి రీల్‌ లైఫ్‌లో వెంకీ మామ చేశాడు. ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక త్వ‌ర‌లో తమిళ సూపర్‌ హిట్‌ అసురన్‌ రీమేక్ చేయ‌నున్నాడు.

ఒక‌వైపు కుర్ర హీరోల‌ని ప్రోత్స‌హిస్తూ మరో వైపు మంచి సినిమాలు చేస్తున్న వెంక‌టేష్‌కి టాలీవుడ్ సినీ లోకం జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి, కోన వెంక‌ట్‌, అనీల్ సుంక‌ర‌, రాశీ ఖ‌న్నా, నితిన్, శ్రీను వైట్ల‌, బాబీ, రానా ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు వెంకీకి బ‌ర్త్‌డే విషెస్ అందించారు.

Related posts

Leave a Comment