ఎయిర్‌టెల్ తెచ్చింది ‘ట్రూలీ అన్‌లిమిటెడ్’ ప్లాన్స్…

టెలికం సంస్థలు అన్నీ ఇప్పుడు తమ ప్లాన్స్‌ను మార్చేశాయి… నష్టాల నుంచి బయటపడడానికి ఛార్జీలను పెంచేశాయి.. పాత ప్లాన్స్‌ను మార్చేసి కొత్త ప్లాన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చిన భారతీ ఎయిర్‌టెల్.. తాజాగా మరికొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది.. “ట్రూలీ అన్‌లిమిటెడ్” పేరిట తెచ్చిన ఈ కొత్త ప్లాన్స్‌లో తన నెట్‌వర్స్‌తో పాటు ఇతర నెట్‌వర్క్‌లకు కూడా అన్‌లిమిటెడ్ కాల్స్‌ అవకాశం కల్పించింది ఎయిర్‌టెల్.

ఎయిర్‌టెల్ తెచ్చిన తాజా ప్లాన్స్‌ను ఓసారి పరిశీలిస్తే.. రూ.219 నుంచి రూ.449 రేంజ్ వరకు ఉన్నాయి… ప్లాన్స్‌ను బట్టి వ్యాలిడిటీ మారుతుంది. దీనిలో మొదటగా రూ. 219 ప్లాన్స్‌ను పరిశీలిస్తే 28 రోజుల వ్యాలిడిటీతో ఏ నెట్‌వర్స్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉండగా.. రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఇక రూ.399లోనూ అన్‌లిమిటెడ్ కాల్స్.. రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 56 రోజుల పాటు పొందవచ్చు.. మరో ప్లాన్ రూ.449 విషయానికి వస్తే 56 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌లోనూ ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమెట్‌ కాల్స్ చేసుకునే వీలుండగా.. రోజుకు 2జీబీ డేటా, రోజుకు 90 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

Related posts

Leave a Comment