కియా బాటలోనే మరిన్ని సంస్థలు ఏపీకి వస్తాయి: జగన్

Jagan meeting at Praja Vedika

కియా పరిశ్రమ ద్వారా 18 వేల మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కియా బాటలోనే మరిన్ని సంస్థలు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. ఏపీలో మరిన్ని బ్రాంచిలు ప్రారంభం కావాలని అన్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆ సంస్థ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఆ సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ కియా ఫ్యాక్టరీని ప్రారంభించటం సంతోషంగా ఉందని, ఆ సంస్థ కార్ల పరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు కావటం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థను అభినందిస్తున్నానని చెప్పారు.

Related posts

Leave a Comment