73 ఏళ్ల వయసులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ప్రజాగాయకుడు గద్దర్!

తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడి ఉద్యోగానికి ప్రజాగాయకుడు గద్దర్ దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న సాంస్కృతిక సారథి కార్యాలయానికి 73 ఏళ్ల గద్దర్ నిన్న స్వయంగా వెళ్లారు. అయితే, నిర్ణీత నమూనాలో కాకుండా తన సొంత లెటర్ ప్యాడ్ పై ఉద్యోగానికి ఆయన దరఖాస్తు చేయడం గమనార్హం. తన వయసు 73 ఏళ్లని, తానొక గాయకుడినని, గాయపడ్డ ప్రజల పాటలను రాయడం, పాడటం తన వృత్తి అని దరఖాస్తులో పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యను చదివిన తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్లు లేవని అందులో తెలిపారు. కళాకారునిగా తనను నియమించాలని కోరారు.

Related posts

Leave a Comment