‘కేసీఆర్ రాతి గుండెకు తగలలేదా?’

ఆర్టీసీ కార్మికుల ఆవేదన కేసీఆర్ రాతి గుండెకు తగలలేదా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులపై సానుభూతి చూపించండి అంటూ విజ్ఞప్తి చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని కోరారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొన్ని సూచనలు చేశారని చెప్పారు. వాటిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పార్టీ నేతలందరితోనూ చర్చించారని తెలిపారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, ప్రభుత్వం మొండి వైఖరితో ఇలాగే ముందుకు వెళ్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ రూట్లను జాతీయం చేస్తామన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర రాజకీయాలపై స్పందించిన కుసుమకుమార్.. బీజేపీకి తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Comment