సంపూర్ణేష్ కారు ప్ర‌మాదం.. గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ సంపూ ఫ్యామిలీ

సినీ న‌టుడు సంపూర్ణేష్ బాబు పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. త‌న భార్య‌, పిల్ల‌ల‌తో కారులో ప్ర‌యాణిస్తుండ‌గా, ఆర్టీసీ బ‌స్సు ఆయ‌న కారుని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో సంపూర్ణేష్, ఆయ‌న‌ భార్య‌, కూతురికి స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. సిద్ధిపేట కొత్త బ‌స్టాండ్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు పోలీసులకి స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే వారు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని సంపూ ఫ్యామిలీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సంపూర్ణేష్ చివ‌రిగా కొబ్బ‌రి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

Related posts

Leave a Comment