ఇంకా ఎంత మంది చనిపోతే మీ రక్తదాహం తీరుతుంది?: రేవంత్ రెడ్డి ధ్వజం

అక్టోబరు 5 నుంచి 52 రోజుల పాటు సాగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెర పడిన విషయం తెలిసిందే. నేటి నుంచి కార్మికులు విధుల్లో చేరుతారని ఆర్టీసీ జేఏసీ వెల్లడించినప్పటికీ.. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెకు దిగి, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరుతామంటే కుదరదంటూ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘నియంతృత్వ దుర్మార్గ పాలనకు పరాకాష్ఠ. ముప్పై మంది చనిపోయిన కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుంది. ఇంకా ఎంత మంది చనిపోతే మీ రక్తదాహం తీరుతుంది? బేషరతుగా ఆర్టీసీ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Related posts

Leave a Comment