అమ్మకానికి పిడకలు

మనం పిడకలుగా పిలుచుకొనే వాటిని అమెరికాలోని న్యూజెర్సీలో ఓ దుకాణంలో ‘ఆవు పేడ కేకుల’ పేరుతో అమ్మకానికి పెట్టారు. ఆన్‌లైన్‌ రేటు కన్నా తక్కువ ధర.. రూ.215 కే ఇవి లభ్యమవుతున్నాయి. భారతీయ జర్నలిస్ట్‌ ఒకరు వాటి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. నెటిజెన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. న్యూజెర్సీలోని ఓ దుకాణంలో 2.99 డాలర్లకు అమ్మకానికి పెట్టిన ఆవు పేడ కేకుల ఫొటోను తన సోదరి పంపించిందని జర్నలిస్ట్‌ సమర్‌ హలంకర్‌ తెలిపారు. ‘ఇంతకీ ఇవి దేశీ ఆవు పేడతో చేసినవా? లేక విదేశీ ఆవు పేడవా?’ అంటూ ఫొటోలతో పాటు తన సందేహాన్ని కూడా పంచుకొన్నారు. అనుమానం నివృత్తి చేసుకోవడానికి రుచి చూస్తే మీకే తెలుస్తుంది.. అంటూ ఓ నెటిజన్‌ ఉచిత సలహా ఇచ్చారు. తినేందుకు కాదు, మతపరమైన కార్యక్రమాల నిర్వహణకే అని తయారీదారులు ప్యాకెట్‌పై స్పష్టంగా పేర్కొనడం విశేషం.

Related posts

Leave a Comment