299కే స్వచ్ఛ ఆక్సిజన్‌

న్యూఢిల్లీ: రూ.299 చెల్లించండి.. 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ పీల్చుకోండి. విచిత్రంగా అనిపించి నా ఇది నిజం. ఢిల్లీలో వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ‘ఆక్సీ ప్యూర్‌ సంస్థ’ స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిస్తామని ముందుకొచ్చింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలోని సాకేత్‌లో సిటీ వాక్‌ మాల్‌ లో ఓ ఆక్సిజన్‌ బార్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో ఏడు ఫ్లేవర్లు కూడా ఉన్నాయి. స్పియర్‌మింట్‌, పిప్పర్‌మింట్‌, సిన్నామన్‌, ఆరంజ్‌ వంటి ఏడు సుగంధ ద్రవ్యాల సువాసనల్లో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ప్రాణ వాయువును ఆస్వాదించవచ్చని సంస్థ చెప్తున్నది. ఇక్కడ ఒక వ్యక్తికి రోజులో ఒకసారి మాత్రమే ఆక్సిజన్‌ను సరఫరా చేస్తారు. ఆక్సిజన్‌ బార్లు మనకు కొత్తే అయినా.. చాలా దేశాల్లో ఇవి ఏండ్లుగా నడుస్తున్నాయి. స్వచ్ఛ ప్రాణవాయువును పీల్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందిదని నిర్వాహకులు చెప్తున్నారు.

Related posts

Leave a Comment