రేషన్‌ కార్డుకు అదనంగా 4 ముఖ్యమైన కొత్త కార్డులివే..!

ఏపీ ప్రభుత్వం.. మరో కొత్త ప్రతిపాదనను ప్రకటించింది. ఇన్నాళ్లూ.. ఒక కుటుంబానికి రేషన్‌ కార్డు ఆధారంగా.. వివిధ పథకాల ఫలాలు అందుతూ వచ్చేవి. కానీ.. ఇప్పుడు అందులో కూడా జగన్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. వినూత్నంగా.. రేషన్‌ కార్డు స్థానంలో మరో నాలుగు కొత్త కార్డులను ప్రవేశపెట్టింది.

నాలుగు కొత్త కార్డులు ఇవే:

  • బియ్యం కార్డు
  • పింఛన్ కార్డు
  • ఆరోగ్య శ్రీ కార్డు
  • ఫీజు రియంబర్స్ కార్డు ఇప్పటి నుంచి ఏ శాఖకు సంబంధించి.. ఆ కార్డును లబ్ధిదారులు ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే.. రేషన్‌ షాపులో బియ్యం కార్డు, ఉచిత వైద్యల సేవల కోసం ఆరోగ్యశ్రీ కార్డు, చదువు విషయంలో ఫీజు రియంబర్స్‌‌మెంట్ కార్డు, పింఛన్ పొందే వారి కోసం పింఛన్ కార్డులను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డులను.. ఈ నెల 20వ తేదీ నుంచే గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. ఎంపికైన అర్హులకు జారీ చేస్తారు. అయితే.. పాత రేషన్ కార్డు మాత్రం రద్దు కాదు.. దాన్ని ఎలా ఉపయోగించాలన్నది ప్రభుత్వం యోచిస్తోంది.

Related posts

Leave a Comment