రూ.7000 జీతం ఉంటే టూవీలర్ లోన్.. బ్యాంక్ బంపర్ ఆఫర్!

చిరుద్యోగులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మాములుగా టూవీలర్ లోన్స్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి లోన్ దక్కుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారి వేతనం కూడా దాదాపు రూ.15 వేలు దాటి ఉండాలి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు, నెలకు రూ.7000 అందుకుంటున్న వారు సైతం ద్విచక్ర వాహనాల కొనుగోలు కోసం రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చని అంటున్నారు. అంటే ఉద్యోగం చేస్తున్న వారి వార్షిక ఆదాయం రూ.84,000 వేలు.. స్వయం ఉపాధి పొందుతున్న వారి వార్షిక ఆదాయం రూ.72,000 వేలు ఉండాలి. టూవీలర్ కొనుగోలుకు అవసరమైన పూర్తి డబ్బును రుణం రూపంలో పొందవచ్చని.. 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం కూడా లభిస్తుందని అంటున్నారు. అయితే ఇది కేవలం ఎంపిక చేసిన మోడల్స్‌కు మాత్రమే వర్తిస్తుందట.

టూవీలర్ లోన్ వివరాలు ఇలా ఉన్నాయి…

లోన్ ప్రాసెసింగ్ ఫీజు- 3 శాతం, డాక్యుమెంటేషన్ చార్జీలు- 2 శాతం ఉంటాయట. ప్రీ పేమెంట్ ఛార్జీలు, లోన్‌పై వడ్డీ రేటు 10.4 శాతం నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇక ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, లేటెస్ట్ శాలరీ స్లిప్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా సబ్‌మిట్ చేయాలట. కాగా, తీసుకున్న రుణాన్ని ఏడాది నుంచి నాలుగేళ్ళ లోపు తిరిగి చెల్లించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇకపోతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోనే మీకు అకౌంట్ ఉంటే.. ప్రత్యేక డిస్కౌంట్ కూడా లభిస్తుందట. ఇక ఆలస్యమెందుకు..? మీరు కూడా వెంటనే టూవీలర్ లోన్‌కు అప్లై చేసుకోండి.

Related posts

Leave a Comment