చిత్తూరులో ఎలుకల కారణంగా ప్రాణాలు కోల్పోయిన యువతి!

ఎలుకల కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అగరంలోని గుడుపల్లె గ్రామంలో కరెంటు స్తంభానికి ఓ స్విచ్‌ అమర్చి ఉంది. ఆ బాక్సులోకి ఎలుకలు దూరి, తీగలను కొరికేశాయి. దీంతో ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా అయింది. ఈ విషయాన్ని గుర్తించని సరోజ (19) ఉతికిన దుస్తులను అక్కడి కమ్మీపై ఆరవేయాలని చూసింది. అదే సమయంలో స్తంభం నుంచి కమ్మీలోకి కరెంటు సరఫరా కావడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది.

ఈ విషయాన్ని గుర్తించిన సరోజను రక్షించి, స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. కరెంటు స్తంభంలోకి విద్యుత్ ఎలా ప్రవహించిదన్న విషయాన్ని పరిశీలించగా స్విచ్ లో చేరిన ఎలుకలే.. తీగలను కొరికేవాయని తెలిసింది.

Related posts

Leave a Comment