హ్యాపీ బర్త్ డే అనుష్క…

మంగుళూరులో జన్మించిన అనుష్క బెంగళూరులో విద్యాభ్యాసం చేసింది. బీసీఏ చదివినా.. చిన్నతనం నుంచి యోగాపై ఆసక్తితో అనుష్క యోగ శిక్షకురాలిగా పనిచేసింది. యోగాలో శిక్షణ పొంది శిక్షకురాలిగా పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది. 2005లో సూపర్ సినిమాతో అవకాశం దక్కించుకొని మంచి విజయం అందుకుంది అనుష్క. ఫస్ట్ సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకుంది. తన రోల్ తక్కువే అయినప్పటికీ సూపర్ గా మెప్పించింది. ఈ సినిమా తరువాత అనుష్కకు దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న విక్రమార్కుడు సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో గ్లామర్ పాత్రకే పరిమితం అయినా రాజమౌళి సినిమా కాబట్టి ఒప్పేసుకుంది. ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.

ఈ సినిమా తరువాత అనుష్క మెగాస్టార్ స్టాలిన్ సినిమాలో ఓ సాంగ్ లో మెప్పించింది. ఆ తరువాత ఈ భామ గోపీచంద్ తో కలిసి లక్ష్యం చేసింది. ఆమె లక్ష్యం గురి తప్పలేదు. సూపర్ హిట్ అయ్యింది. మంచి పాత్ర దొరకడంతో తనలోని నటనను ప్రదర్శించే అవకాశం దక్కింది. ఈ సినిమా తరువాత డాన్, ఒక్కమగాడు, బలాదూర్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్ వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలు కమర్షియల్ గా హిట్ కొట్టాయి.

2009లో ఆమె చేసిన అరుంధతి సినిమా ఆమెలోని నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 65 కోట్లు కలెక్ట్ చేసింది. భారీ పాత్రలు చేయాలి అంటే అనుష్కకు మాత్రమే సాధ్యం అవుతుంది అనేలా ఆమె నటన ఉండటం విశేహం. దీని తరువాత భిల్లా, యముడు, వేదం, పంచాక్షరీ, ఖలేజా, నాగవల్లి, ఢమరుకం, సింగం 2, లింగ, సినిమాలు చేసింది. ఆ తరువాత చేసిన బాహుబలి ది బిగినింగ్, మిర్చి, బాహుబలి 2, భాగమతి సినిమాతో అనుష్క తిరుగులేని స్టార్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ కొంత గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం చేస్తోంది. ఇలా వరసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిన అనుష్క పుట్టినరోజు నేడు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.

Tags: Birthday Anushka Shetty, Happy Birthday Anushka,
Anushka Shetty Actress,Arundhati,Baahubali

Related posts

Leave a Comment