నేడు అమరావతిలో టీడీపీ నేతల పర్యటన

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటించనుంది. అమరావతిలో నిర్మాణాలే లేవు అనే విమర్శలకు కౌంటర్ గా టిడిపి పర్యటన చేస్తోంది. రాజధాని మాస్టర్ ప్లాన్లో నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించనుంది. రాజధానికి గుర్తింపు లేకుండా చేశారనే విమర్శలు ప్రతివిమర్శల తరుణంలో తెలుగు దేశం నేతల టూర్ అసక్తి గా మారింది.ఆ పార్టీ ఫ్లోర్ లీడర్లు, కృష్ణా గుంటూరు జిల్లాల నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. రాజధానిలో ఇప్పటికే 9 వేల కోట్లు ఖర్చు అయ్యిందని చెపుతున్న ప్రతిపక్షం అక్కడ నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించనుంది. అచ్చెన్నాయుడు, నారాయణ నేతృత్వంలో నేతలు పర్యటించనున్నారు. జగన్‌ ప్రభుత్వం అమరావతిపై నిపుణుల కమిటీ వేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. నిపుణల కమిటీ ఏం చేస్తుందని నిలదీశారు. రాజధాని ఎంపిక, భూసమీకరణలో ఏ తప్పూ జరగలేదని అన్నారు చంద్రబాబు.

Related posts

Leave a Comment