నన్ను తిట్టి లాభం లేదు.. పవన్‌ కల్యాణ్‌

విశాఖపట్నంలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తే.. ఊహించనంత మంది వచ్చారు. అంటే సమస్య అంత తీవ్రంగా ఉందని అర్థం. దానిని ముందు పరిష్కరించడానికి జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించాలి. నన్ను తిడితే లాభం లేదు.. ఎన్ని అన్నా నా ఒళ్లు చావదు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించకుండా తనను తిడితే వైసీసీ నాయకులే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని తేల్చిచెప్పారు. వారు ఇసుకలో ఇంకేదో బెనిఫిట్‌ వెదుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం సాయంత్రం విశాఖలో పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌, వీవీ లక్ష్మీనారాయణలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఇసుక లభించక భవన నిర్మాణ కార్మికులు ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారికంగా పది మంది వరకు చనిపోగా.. అనధికారికంగా 50 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. సమస్యపై ఇంతమంది గళమెత్తి రోడ్ల మీదకు వస్తే.. ప్రజల్లో ఆగ్రహావేశాలు రెచ్చగొడుతున్నానని ఆరోపించడం తగదు. 151 సీట్లు గెలుపొందిన పార్టీ వైసీపీ ఈ ఐదు నెలల్లో సుపరిపాలన అందిస్తే జనసేన మీటింగ్‌కు అంత మంది ఎందుకు వస్తారో ఆలోచించాలి’ అని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

Related posts

Leave a Comment