సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. ‘ఇసుక ప్రజలకు ప్రకృతి ఇచ్చిన వరం.. దానికి ప్రభుత్వం అడ్డం పడరాదు. ఇసుక అందించలేనపుడు రాష్ట్రం దాటకుండా నిఘా పెట్టి రాష్ట్రం లోపల ప్రజలు ఎక్కడ దొరికితే అక్కడ ఇసుకను ఉచితంగా తీసుకునేలా వెంటనే ఆదేశాలు ఇవ్వండి. ప్రజలు సుఖంగా బతికేలా పాలన ఉండాలి. ఇసుక కొరత లాంటి కారణాలు ప్రజల ఆత్మహత్యలకు దారితీయడం దారుణం. సమాజంలో మేధావి నుండి సామాన్యుడి వరకూ ఇసుక పాలసీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి భూములు అమ్మబోతున్నారన్న వార్తలు వింటున్నాం. ఎన్నికల సమయంలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా పెట్టాలని చూస్తున్నారు. వాటి అమలుకు తేదీలు ప్రకటిస్తున్నారు. కానీ అందులో మా కాపుల రిజర్యేషన్ అంశం లేకపోవడం మా కాపులు చేసుకున్న పాపంగా భావిస్తున్నాం. మీరు పరిపాలన చేస్తున్న తీరు మీరు తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారని తెలియజేస్తోంది’ అని జగన్‌కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. అయితే కాపు ఉద్యమనేత లేఖపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Related posts

Leave a Comment