రైతు, కార్మికుల కన్నీరు తుడిచేందుకు పోరాటం : పవన్‌కళ్యాణ్‌

రైతు, కార్మికుడు కన్నీరుపెడితే తుడిచేందుకు ఎక్కడైనా పోరాటంచేస్తానని జనసేన నేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా గౌనిపల్లిలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో ఆదివారం పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సభకు స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్‌.రమేశ్‌కుమార్‌ అధ్యక్షత వహించగా సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి గోపాలగౌడ, నంజావధూత స్వామిజీలు పాల్గొన్నారు. వేదికపై పవన్‌కల్యాణ్‌ మాట్లాడేందుకు ముందే రమేశ్‌కుమార్‌కు పాదాభివందనం చేశారు. అనంతరం అభిమానులు, భక్తులనుద్దేశించి పవన్‌కల్యాణ్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘కన్నడిగరగు శుభాశయగళు’ అంటూ.. కన్నడలో మాట్లాడలేకపోతున్నానని బాధ కలుగుతోందని ఇదే చోట మరోసారి కన్నడలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు. జీవితంలో ఎందరో పెద్దల పరిచయం, వారి అనుభవం తనకు దక్కుతోందన్నారు.

సుప్రీం మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ పిలుపు మేరకు గౌనిపల్లికి వచ్చానని మీ అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. 40ఏళ్ళపాటు నైతిక విలువలతో రాజకీయాలలో కొనసాగిన రమేశ్‌కుమార్‌ వేదికపై బాధపడిన తీరు నాకు ఆలోచన కలిగిస్తోందన్నారు. ఆయన చేసిన శాసనాలు కోట్లాదిమందిపై ప్రభావం చూపాయని అంతటి శక్తి కలిగిన రాజకీయ నేత అని కొనియాడారు.

Related posts

Leave a Comment