నవంబర్‌ 7న సీఎం గుంటూరు పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన గుంటూరుకు రానున్న నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ఆనంద్‌కుమార్‌తో సీఎం పర్యటనకు సంబంధించి వేదిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలి విడతగా రూ.10వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి లబ్ధి చేకూర్చేందుకు రూ.264.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 3.69లక్షల మంది ఉండగా జిల్లాలో 19,751 మంది ఉన్నారు.

Related posts

Leave a Comment