ఇంటర్‌ వరకూ అమ్మఒడి

Jagan meeting at Praja Vedika

ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న పేద విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకే దీనిని వర్తింపజేయాలని స్పష్టం చేసింది. పథకం కింద లబ్ధి పొందేవారికి తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పింది. తెల్ల కార్డు లేనివారు.. ఇప్పటికే దానికోసం దరఖాస్తు చేసి ఉంటే ప్రభుత్వం ఇచ్చే రశీదు ఉన్నా సరిపోతుందని తెలిపింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న కీలక నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు. ‘ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో ఒకటి నుంచి ఇంటర్‌ దాకా చదివే పేద విద్యార్థుల తల్లులకు అమ్మఒడి కింద కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని, జనవరి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుందని చెప్పారు. తల్లులు లేని చోట పిల్లల సంరక్షకులకు పథకం వర్తిస్తుందన్నారు. వీధి బాలలు, అనాఽథలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే వారికి ఈ పథకం వర్తింపుపై సంబంధిత శాఖను సంప్రదించాలని.. పథకం అమలుకోసం రూ.6,455 కోట్లు ఖర్చుచేయనున్నామని చెప్పారు.

Related posts

Leave a Comment