జయరాం హత్యకేసులో కీలక మలుపు.. పోలీసులపై ఛార్జ్ షీట్.. !

ఈ ఏడాది జనవరి 30 వ తేదీన అమెరికానుంచి వచ్చిన పారిశ్రామికవేత్త జయరాం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో మొదట అయన మేనకోడలు శిఖా చౌదరిని అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, ఇందులో ఆమె ప్రమేయం లేదని తేలడంతో ఆమెను విడిచిపెట్టారు. కాగా, ఈ కేసుపై దృష్టిపెట్టిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

జయరాం హత్యకేసుతో ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ధిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్టు తెలుస్తోంది. రాకేష్ రెడ్డి దగ్గర జయరాం రూ. 4 కోట్లు అప్పుగా తీసుకున్నారని, అప్పు తీర్చాలని ఒత్తిడిలో భాగంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. రాకేష్ రెడ్డితో సంబంధాలు కలిగిఉన్న కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా రాకేష్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్న రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసిపి మల్లారెడ్డిలపై పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో కోర్టులో ప్రారంభమైన ట్రైయిల్ ప్రారంభమైంది. ఈ ట్రైయిల్ కేసుకు కీలకంగా మారనున్నది.

Related posts

Leave a Comment