ప్రతి వ్యక్తికి మెడికల్‌ ఐడీ

హెల్త్‌ ప్రొఫైల్లో భాగంగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి సంబంధించిన ‘మెడికల్‌ ఐడెంటిఫికేషన్‌’ కార్డులను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఈ అంశమ్మీద ఉమ్మడి పది జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామింగ్‌ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. టాటా కన్సల్టెన్సీ అందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో ప్రయోగాత్మకంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో దాదాపు 13 లక్షల మెడికల్‌ ఐడీలు సిద్ధమయ్యాయి. త్వరలోరాష్ట్రమంతటా ప్రతి వ్యక్తి మెడికల్‌ ఐడీని రూపొందించనున్నారు.

ఆశాలు, ఏఎన్‌ఎంలకు తగ్గనున్న భారం
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీతిరిగి అందరి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. పరీక్షలు చేస్తున్నారు. వారికి ఇచ్చిన ట్యాబ్స్‌లో 8 రకాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఒక్కో రకం వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తుండటంతో వారికి పని భారం పెరుగుతోంది. సమయం కూడా ఎక్కువ వెచ్చించాల్సివస్తోంది. ఆ పనిభారాన్ని తగ్గించేందుకే ‘మెడికల్‌ ఐడీ’ విధానాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించింది. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఐడీల కోసం టాటా కన్సల్టెన్సీ ప్రయోగాత్మకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ తరహాలోనే పూర్తిస్థాయి పథకం కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని అధికారులను మంత్రి ఈటల ఆదేశించారు.

Related posts

Leave a Comment