త్వరలో ప్రైవేటు పర్మిట్లు!

రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే మూడు నుంచి నాలుగు వేల రూట్లలో ప్రైవేటువాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఆర్టీసీ కార్మికసంఘాలు తరచూ సమ్మెలకు దిగడంవల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నదని సమాచారం. రెండుమూడ్రోజుల్లోనే రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి, అందులో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ సమస్యను కార్మికసంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈలోపు ప్రజలకు మరింత అసౌకర్యం కలిగే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నదని సమాచారం.

Related posts

Leave a Comment