ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా: కాజల్ అగర్వాల్

దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దశాబ్ద కాలంగా అగ్ర హీరోలతో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బిజీగా ఉంటోంది.

తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో ఎవరిని చంపుతావు? ఎవరితో రిలేషన్ షిప్ లో ఉంటావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? అనే ప్రశ్న కాజల్ కు ఎదురైంది. దీనికి సమాధానంగా చరణ్ ను చంపేస్తానని, తారక్ తో రిలేషన్ షిప్ లో ఉంటానని, ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కాజల్ చెప్పింది. చరణ్, తారక్ లకు ఇప్పటికే పెళ్లయిపోయిందని… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ ను పెళ్లాడతానని తెలిపింది.

Related posts

Leave a Comment