హుజూర్‌నగర్‌ ‘గులాబీ’మయం..వేలాదిగా వస్తున్న ప్రజలు

హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకృతజ్ఞత సభ కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. హుజూర్‌నగర్ అభివృద్ధికి కేసీఆర్ రోడ్‌మ్యాప్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్ నుంచి వందలాది వాహనాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు తరలివెళ్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు దారిపొడవునా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం సూర్యాపేటలో టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

నేడు హుజూర్‌నగర్‌లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. సీఎం రోడ్డు మార్గంలో వస్తున్నందున ప్ర త్యేక రూట్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రహదారులను క్లస్టర్స్‌గా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సామా న్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట రోడ్డు మళ్లిం పు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్‌హాల్ కాసేపు ఆగనున్నారు.

2100 మంది సిబ్బందితో బందోబస్తు

త్రివేణి ఫంక్షన్‌హాల్ వద్ద, హుజూర్‌నగర్ సభ వద్ద కలుపుకొని సుమారు 2100మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎస్పీ ఆర్.భాస్కరన్ పర్యవేక్షణలో ఐ దుగురు ఏఎస్పీలు, 36మంది డీఎస్పీలు, సీఐ, ఎ స్‌ఐలు 95మంది, ఏఎస్‌ఐ హెచ్‌సీలు 250 మం ది, 610మంది కానిస్టేబుల్, 450మంది హోం గార్డులు, 15 ఐడి టీమ్‌లు, 2 కంపెనీల బెటాలియన్ సిబ్బంది, 8 స్పెషల్ పార్టీలు, 8 నాడ్ రూఫ్ పార్టీలు పాల్గొననున్నారు.

Related posts

Leave a Comment