టిక్ టాక్ జోరుకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ల బేజారు!

వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ దూసుకుపోతోంది. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్స్ అయిన ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, హెలో, ట్విట్టర్ లను అధిగమించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీటన్నింటికంటే టిక్ టాక్ డౌన్ లోడ్లే ఎక్కువగా ఉంటున్నాయి. సెన్సార్ టవర్ రిపోర్ట్ 2019 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకున్నది టిక్ టాక్ యాప్ నే.

సెప్టెంబర్ నెలలో 60 మిలియన్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. మొత్తం డౌన్ లోడ్లలో 44 శాతం భారతీయులదే కావడం గమనార్హం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్ లలో రెండో స్థానంలో ఫేస్ బుక్ నిలిచింది. ఫేస్ బుక్ విషయంలో కూడా భారతే తొలి స్థానంలో నిలిచింది. 23 శాతం డౌన్ లోడ్లు ఇండయా నుంచి నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇన్స్టాగ్రామ్, లైకీ, స్నాప్ చాట్ నిలిచాయి.

Tags: TikTok,Instagram,Facebook, Google Play Store

Related posts

Leave a Comment