మున్సిపల్ ఎన్నికలకు పచ్చ జెండా.. ఏ క్షణమైనా నోటిఫికేషన్

రాష్ట్రంలో ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 800 మంది ఓటర్ల ఉన్నారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, బడంగ్‌పేట్, నిజాంపేట్, బండ్లగూడ, మీర్‌పేట్, జవహర్ నగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల కాలపరిమితి ఇంకా ముగియలేదు. పాల్వంచ, మందమర్రి, మణుగూరులో సాంకేతిక కారణాలతో ఎన్నికలు నిర్వహించటం లేదు. జడ్జర్ల, నకిరేకల్‌లో గ్రామాల విలీన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లకు కాలపరిమితి ఇంకా ముగియలేదు.

Related posts

Leave a Comment