మేళ్లచెరువులో మొరాయించిన ఈవీఎంలు

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. మేళ్లచెరువులోని 133 పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దాని స్థానంలో ఏర్పాటు చేసిన మరో ఈవీఎం కూడా మొరాయించడంతో ప్రస్తుతానికి అధికారులు పోలింగ్‌ను నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది. ఉప ఎన్నికలో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం మొత్తం 302 పోలింగ్‌ కేంద్రాల్లో 1708 ఈవీఎంలు ఏర్పాటు చేశారు.

Related posts

Leave a Comment