మనిషి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్న నిద్ర

సమస్యలకు పరిష్కారం దొరక్క సతమతమవుతున్నారా? అయితే, పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం కోసం నిద్రపోవాలని చెబుతున్నారు పరిశోధకులు. మనుషులకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలకు నిద్రలోనే పరిష్కారం లభిస్తోందని తేల్చారు.

ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, బిజీ లైఫ్ లో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు నిద్ర ద్వారా చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. నిద్రిస్తున్న సమయంలో ఆలోచనలు, జ్ఞాపకాలు సంఘటితం కావడమే దీనికి కారణమని తేల్చారు. సమస్యలు ఎదురైనప్పుడు విన్న శబ్దాలను నిద్రలోనూ విన్నప్పుడు ఈ చర్య మరింత వేగవంతమవుతుందని పరిశోధకులు తెలిపారు.

నిద్రిస్తున్న సమయంలో మన మెదడు మామూలు సమయాల్లో కంటే ప్రభావవంతంగా పనిచేస్తుందట. బెంజీన్‌ అణువు ఆకృతి ఎలా ఉంటుందన్న సమస్యకు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించలేదు. అయితే, దీనికి పరిష్కార మార్గాన్ని ఆగస్ట్‌ కెకూలే శాస్త్రవేత్తకు నిద్రలో లభించింది. తనకు వచ్చిన కల ఆధారంగానే బెంజీన్‌ నిర్మాణాన్ని ఆయన కనుగొన్నారు.

Related posts

Leave a Comment