చిరు 152లో స్టాలిన్ హీరోయిన్..!!

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. కొరటాల శివ దర్సకత్వంలో సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

అయితే, ఇందులో మెగాస్టార్ కు జోడిగా ఎవరిని తీసుకుంటున్నారు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. చాలామంది హీరోయిన్ల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఎవరిని ఫైనల్ చేయలేదు. అయితే, మెగాస్టార్ తో స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన త్రిషాను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మాత్రం తెలియడం లేదు. నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.

Tags: Megastar Chiranjeevi, 152movie,Trisha,Koratala Siva, Tollywood, Konidela Productions

Related posts

Leave a Comment