పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో కొత్త సినిమా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పూర్తి సమయాన్ని ప్రజా జీవితంలోనే గడుపుతున్నారు. సినీ ప్రపంచానికి దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. సినిమాల గురించి కనీసం ఎక్కడా మాట్లాడటం కూడా లేదు. అయినప్పటికీ పవన్ సినిమా చేయబోతున్నారంటూ అప్పుడప్పుడు వార్తలు ప్రచారమవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి వార్తే మరొకటి వైరల్ అవుతోంది. ఓ కథతో పవన్ కల్యాణ్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మెప్పించారనేదే ఆ వార్త. ఆ కథ పవన్ కు నచ్చిందని… క్రిష్ దర్శకత్వంలో త్వరలోనే పవన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే పవన్, క్రిష్ ల కాంబినేషన్లో కొత్త సినిమా వస్తున్నట్టే. అయితే ఇది ఎంత వరకు నిజమనే విషయం తెలియాలంటే మాత్రం… అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.

Tags: Pawan Kalyan, Krish, Tollywood

Related posts

Leave a Comment