భారత్ తో పాటు బంగ్లాను కూడా గర్వించేలా చేశారు: గంగూలీకి మమత అభినందనలు

బెంగాల్ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. “బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవనున్న సౌరవ్ గంగూలీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పదవీకాలంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఆశిస్తున్నాను. మీరు భారత్ ను, బంగ్లా (పశ్చిమబెంగాల్) ను గర్వించేలా చేశారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా మీరందించిన సేవలకు సంతృప్తి చెందాం. మీ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ మమతా ట్వీట్ చేశారు.

Tags: Mamatha Banarjee, Sourav Ganguly, Cricket, BCCI

Related posts

Leave a Comment