శ్రీకాళహస్తి ఆలయానికి కాంగ్రెస్ నేత రూ.15 కోట్ల భారీ విరాళం!

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి కాంగ్రెస్ సీనియర్ నేత భారీ విరాళం అందజేశారు. మొత్తం రూ.15 కోట్లు విలువైన తన నివాసం, కమర్షియల్ కాంప్లెక్స్ సహా ఖాళీ స్థలాన్ని ముక్కంటి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు పొన్నేరి సమీపంలోని మీంజూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత వీఆర్‌ భగవాన్‌ ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించారు. మీంజూరులోని తన ఇల్లు, వ్యాపార భవన సముదాయం, దాని వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని పొన్నేరి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఆలయం పేరిట శుక్రవారం రిజిస్టర్‌ చేయించడం విశేషం.

త్వరలోనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి, వివిధ ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన సూచించారు. శివభక్తుడైన వీఆర్ భగవాన్‌ ద్వాదశ జ్యోతిర్లింగాలను పలుసార్లు సందర్శించారు. తమిళనాడులో 30కి పైగా ఆలయాలను కూడా నిర్మించారు.

Related posts

Leave a Comment